రంగనాయకమ్మ సరైన కారణాలు చెప్పలేకపోయారు : సీఐడీ
రంగనాయకమ్మ.. గత మూడు, నాలుగు రోజులుగా వినిపిస్తున్న పేరు.
రంగనాయకమ్మ.. గత మూడు, నాలుగు రోజులుగా వినిపిస్తున్న పేరు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో ప్రజలకు లేనిపోని అనుమానాలు కలుగజేసేలా పోస్టులు పెట్టారన్న కారణంతో గుంటూరుకు చెందిన ఆమెపై కేసు నమోదు చేసిన సీఐడీ.. నోటీసులు కూడా జారీ చేసింది.. దాంతో రంగనాయకమ్మ గురువారం సీఐడీ ముందు విచారణకు హాజరయ్యారు. ఆమెపై విచారణ అనంతరం సీఐడీ ఓ ప్రకటన చేసింది.
ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి 50 శాతం జీతాలు తగ్గించారంటూ రంగనాయకమ్మ పోస్టు చేశారని సీఐడీ అందులో పేర్కొంది. అంతేకాక విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం, అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు చేసినట్టు ఆ ప్రకటనలో సిఐడి అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ పోస్టులు చేస్తున్నారని వివరించింది. గురువారం సిఐడి అధికారులు జరిపిన విచారణలో తనను తాను సోషల్ మీడియా ఉద్యమకారిణిగా ఆమె చెప్పుకుంటున్నారని.. ఆ పోస్టులు పెట్టడానికి సరైన కారణాలు చెప్పలేకపోయిందని సిఐడి వెల్లడించింది.