Tirumala: తిరుమల అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత భయం
Tirumala: 320 ట్రాప్ కెమెరాలతో వన్యమృగాల కదలికలను గుర్తిస్తున్న అటవీశాఖ
Tirumala: తిరుమల అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత భయం పట్టుకుంది. ఇప్పటి వరకు అటవీశాఖ నాలుగు చిరుతలను బంధించింది. గత 2 రోజుల క్రితం అలిపిరి నడకమార్గంలో... ట్రాప్ కెమెరాలో చిరుత కదలికలు రికార్డయ్యాయి. చిరుత సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు.. బోన్లు ఏర్పాటు చేశారు. అయితే రెండు రోజులుగా చిరుత ట్రాప్ కెమెరాలకు కూడా చిక్కకుండా తిరుగుతుంది. బాలిక లక్షిత మృతదేహం లభ్యమైన ప్రాంతంలో చిరుత సంచారిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.