Chandrababu: నేటితో ముగియనున్న రిమాండ్.. నేడు విచారణకు హాజరుకానున్న చంద్రబాబు

Chandrababu: వర్చువల్‌ విచారణకు రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో అన్ని ఏర్పాట్లు చేసిన కోస్తా జైళ్ల శాఖ

Update: 2023-09-22 05:06 GMT

Chandrababu: నేటితో ముగియనున్న రిమాండ్.. నేడు విచారణకు హాజరుకానున్న చంద్రబాబు

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో తీర్పు వెలువడనుంది. ఉదయం పదిన్నర గంటలకు విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించనుంది. చంద్రబాబును కస్టడీకి ఇవ్వాల్సిందేనని సీఐడీ తరఫు లాయర్లు వాదించగా.. ఇప్పటికే విచారణ ముగిసి.. రిమాండ్‌ ఖైదీగా చంద్రబాబు ఉన్నారని, కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో.. చంద్రబాబు కస్టడీ పిటిషన్‌ తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. చంద్రబాబుపై సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది.

ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ అలైన్‌మెంట్‌, ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌లో అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబుపై అభియోగాలు ఉన్నాయి. ఈ కేసులో కస్టడీకి కోరుతూ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పీటీ వారెంట్‌ వేశారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టనుంది ఏసీబీ కోర్టు. మరోవైపు చంద్రబాబు రిమాండ్ నేటితో ముగియనుంది. ఇవాళ విచారణకు హాజరుకానున్నారు చంద్రబాబు. వర్చువల్‌ విధానంలో చంద్రబాబును జడ్జి ఎదుట పోలీసులు హాజరపర్చనున్నారు. వర్చువల్‌ విచారణకు రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కోస్తా జైళ్ల శాఖ అధికారులు. స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో ఈ నెల 9న చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. నేటి వరకు చంద్రబాబుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు.

Tags:    

Similar News