Lakshmi Parvathi: NTRకు వెన్నుపోటు పొడవడంలో పురంధేశ్వరిది కీలక పాత్ర
Lakshmi Parvathi: పురంధేశ్వరి, చంద్రబాబును వచ్చే ఎన్నికల తర్వాత.. రాజకీయాల్లో కనిపించకుండా చేస్తా
Lakshmi Parvathi: చంద్రబాబు, పురంధేశ్వరిని వచ్చే ఎన్నికల తర్వాత రాజకీయాల్లో లేకుండా చేస్తానన్నారు లక్ష్మీ పార్వతి. NTR నాణెం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించకుండా అవమానించారని మండిపడ్డారు. ఆయన భార్యగా తాను హాజరవ్వాల్సిన కార్యక్రమానికి.. ఆహ్వానం అందకుండా చంద్రబాబు, పురంధేశ్వరి అడ్డుకున్నారని ఆరోపించారు.
తనకు NTR భార్యను అనే గౌరవం ఇవ్వలేదన్నారు. NTRకు వెన్నుపోటు పొడిచి.. ఆయన ప్రాణం తీసిన వాళ్లు నాణెం విడుదలకు వెళ్లారన్నారు లక్ష్మీ పార్వతి. ఇన్నాళ్లూ అభిమానంతో NTR కుటుంబం గురించి మాట్లాడలేదని.. ఇకపై ఆ కుటుంబాన్ని, చంద్రబాబును వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. NTR వాళ్ల గురించి ఏం చెప్పారో అన్నీ బయటకు తీస్తానన్నారు.