Andhra Pradesh: నేడు కర్నూలు ఎయిర్ పోర్టు ప్రారంభం

Andhra Pradesh: కర్నూలు విమానాశ్రయాన్నినేడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.

Update: 2021-03-25 02:25 GMT

ఆంధ్రప్రదేశ్:(ఫోటో ది హన్స్ ఇండియా)

Andhra Pradesh: కర్నూలు విమానాశ్రయాన్నినేడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11.45 గంటలకు కర్నూలు విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు జ్యోతి వెలిగించి, ప్రత్యేక తపాలా స్టాంపు ఆవిష్కరిస్తారు. టెర్మినల్‌ భవనం వద్ద దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణలో పాల్గొననున్నారు. 12.35 గంటలకు విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఇండిగో సంస్థ రెండేళ్ల పాటు కర్నూలు నుంచి బెంగళూరు, చెన్నై, విశాఖ నగరాలకు విమాన సర్వీసులను నడపనుంది.

బెంగళూరు నుంచి విమానం ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో ఉదయం 9.05 గంటలకు బయలుదేరి 10.10 గంటలకు కర్నూలు చేరుతుంది. తిరిగి అదేరోజు మధ్యాహ్నం 3.15 గంటలకు కర్నూలు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 4.25 గంటలకు బెంగళూరు చేరుకోనుంది. ప్రతి సోమ, బుధ, శుక్ర, ఆదివారాల్లో కర్నూలు నుంచి ఉదయం 10.30 గంటలకు బయలుదేరి విశాఖపట్నానికి 12.40 గంటలకు చేరుతుంది. అదే రోజుల్లో తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి 2.55 గంటలకు కర్నూలు చేరుకోనుంది. చెన్నై నుంచి ప్రతి మంగళ, గురు, శని, ఆదివారాల్లో మధ్యాహ్నం 2.50 గంటలకు బయలుదేరి కర్నూలుకు 4.10 గంటలకు చేరుకుంటుంది. అదే రోజుల్లో కర్నూలు నుంచి సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి చెన్నైకి సాయంత్రం 5.50 గంటలకు చేరుతుందని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News