Vijayawada: దుర్గ గుడి ఈవోగా కేఎస్ రామారావు.. తక్షణమే విధుల్లో చేరాలని ఉత్తర్వులు
Vijayawada: విజయవాడ కనక దుర్గ దేవాలయ ఈవోగా కెఎస్ రామారావును నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Vijayawada: విజయవాడ కనక దుర్గ దేవాలయ ఈవోగా కెఎస్ రామారావును నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే విధుల్లో చేరాలంటూ ప్రభుత్వం ఆయనను ఆదేశించింది.. కాగా ఇప్పటికే ఈవోగా పనిచేస్తున్న శ్రీనివాసరావు రిలీవ్ కావడానికి ఆలస్యమవుతున్నందున కేఎస్ రామారావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్... మరో వారం రోజుల్లో బెజవాడ కనగదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.