Krishna Godavari Rivers: ఉరకలెత్తుతున్న కృష్ణా గోదావరి.. నిండు కుండల్లా ప్రాజెక్టులు!
Krishna Godavari Rivers: కృష్ణా, గోదావరి నదులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
Krishna Godavari Rivers: కృష్ణా, గోదావరి నదులు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ఆయా నదుల పై ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయిలో నిండిపోయాయి. దాదాపుగా అన్ని ప్రాజెక్టుల్లోనూ నీటిమట్టం పరిమితికి మించి నీరు వచ్చి చేరింది. దీంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వివిధ ప్రాజెక్టుల్లో నీటిమట్టం.. కిందకు వదులుతున్న నీరు వివరాలు..
శ్రీశైలం ప్రాజెక్టు..
- ఇన్ ఫ్లో : 4,30,566 క్యూసెక్కులు
- ఔట్ ఫ్లో : 1,91,362 క్యూసెక్కులు
- పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు
- ప్రస్తుత : 883.00 అడుగులు
- నీటి నిల్వ సామర్ధ్యం:215.807 టిఎంసీలు
- ప్రస్తుతం : 204.7889 టీఎంసీలు
కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
నిర్మల్ కడెం ప్రాజెక్టు..
- ప్రస్తుతం నీటినిల్వ 6.75
- పూర్తి స్థాయినీటినిల్వ సామర్థ్యం7.603టీఎంసీలు
- ప్రస్తుతం నీటి మట్టం 696.625 అడుగులు
- గరిష్ట నీటి మట్టం700 అడుగులు
- ఇన్ ప్లో - 17060 క్యూసెక్కులు
- అవుట్ ప్లో- 18193 క్యూసెక్కులు
నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్
- ప్రాజెక్టు కు 85000 క్యూస్సేక్కుల ఇన్ ఫ్లో...
- ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, ప్రస్తుతం 1084.60 అడుగులు,
- ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 90 టి ఎమ్ సి లు, ప్రస్తుతం 65.606 టి ఎమ్ సిలు
శ్రీరామసాగర్..
- 80 వేల క్యూసెక్కులు నీరు ఉంది
- దిగువన కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటిమట్టాలతో ఉన్నాయి.
- ఎల్లంపల్లి గేట్లు ఎత్తి 33 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
- లక్ష్మీ బ్యారేజీలో 65 గేట్ల ద్వారా 4,76,200 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
- సరస్వతి బ్యారేజీ 17 గేట్లు ఎత్తి 38,000 క్యూసెక్కుల నీటిని వదిలారు. ధవళేశ్వరం వద్ద గోదావరి..
- ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం 22 లక్షల క్యూసెక్కుల నుంచి క్రమంగా తగ్గి 18.99 లక్షలకు చేరింది.
- సముద్రంలోకి 19,09,446 క్యూసెక్కులను విడుదల చేశారు.