Kotamreddy Sridhar Reddy: అవమానాలు తట్టుకోలేకే బయటకు వచ్చా
Kotamreddy Sridhar Reddy: ప్రభుత్వంలోని పెద్దలే ఫోన్ ట్యాప్ చేశారన్న కోటంరెడ్డి
Kotamreddy Sridhar Reddy: అవమానించిన చోట ఉండకూడదనే ఉధ్దేశంతోనే నీతిగా నిజాయతీగా అధికారాన్ని వదులు కుంటున్నానని వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ప్రెస్ మీట్ లో మాట్లాడిన ఆయన వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. సొంత పార్టీ వారే తన ఫోన్ ట్యాప్ చేయడం చాలా బాధ కలిగించిందన్నారు. ఇది అధికారులు చేసిన ట్యాంపింగ్ కాదని, ప్రభుత్వంలోని పెద్దలే చేయించారని ఆరోపించారు.