Kotamreddy: ఇప్పుడున్న ఇద్దరు గన్‌మెన్లు కూడా నాకొద్దు

Kotamreddy: నాకు గన్‌మెన్లు అవసరం లేదు

Update: 2023-02-05 05:32 GMT

Kotamreddy: ఇప్పుడున్న ఇద్దరు గన్‌మెన్లు కూడా నాకొద్దు

Kotamreddy: భద్రత కుదించడంపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పందించారు. తనకున్న నలుగురు గన్‌మన్‌లలో ఇద్దరిని తొలగించారని కోటంరెడ్డి తెలిపారు. అయితే ఇప్పుడున్న ఇద్దరు గన్‌మెన్లను కూడా నాకొద్దు వారిని తిప్పి పంపిస్తున్నానని కోటంరెడ్డి అన్నారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని మానసికంగా ఇబ్బంది పెట్టేందుకే ఇలా చేశారని కోటంరెడ్డి ఆరోపించారు. అయితే నాకు గన్‌మెన్లు అక్కరలేదని ఏమైనా చేసుకోండంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పష్టం చేశారు. ఎంత దూరమైనా వెళ్తా, తగ్గేదే లేదన్నారు. ఇంత జరిగినా అసలు గన్‌మెన్లను తొలగించేలేదని ASP పచ్చి అబద్ధాలు చెబతునున్నారని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. 

Tags:    

Similar News