Kotamreddy: పార్టీలు మారిన వారు ద్రోహులైతే.. జగన్ కాంగ్రెస్‌కు చేసింది ద్రోహం కాదా
Kotamreddy: రాజకీయాల్లో పార్టీలు మారడం సహజం
Kotamreddy: ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అనిల్‌పై మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యే అనిల్ అచ్చొచ్చిన ఆంబోతులా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదరహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిపై విజయసాయి, అనిల్ విమర్శలు చేయడం సరికాదన్నారు. జగన్‌కు అత్యంత దగ్గర ఉండే విజయసాయిరెడ్డి నెల్లూరుకు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. రాజకీయాల్లో పార్టీలు మారడం సహజమన్నారు. పార్టీలు మారిన వారు ద్రోహులైతే.. జగన్ కాంగ్రెస్‌కు చేసింది ద్రోహం కాదా అని విమర్శించారు.