తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు...

Tirumala Tirupati: ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించమని టీటీడీ స్పష్టం...

Update: 2022-03-29 03:49 GMT

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు...

Tirumala Tirupati: తిరుమలలో కోయిల్ అళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉగాది ఆస్తానం వేడుకకో టీటీడీ ఈ కార్యక్రం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టింది. ఈ సందర్భంగా శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. సాధారణంగా శ్రీవారి ఆలయంలో ఏడాదిలో నాలుగు సార్లు కోయిల్ అళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయం శుద్ది కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పై కప్పు, పూజా సామాగ్రి ఇతర వస్తువులు శుద్ధి చేయనున్నారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర పరిణల జలాన్ని ఆలయం అంతటా సంప్రోక్షణ చేస్తారు. ఆ తర్వాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

Tags:    

Similar News