Kodi Kathi Case: కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా
Kodi Kathi Case: ఈనెల 20కి వాయిదా వేసిన ఎన్ఐఏ కోర్టు
Kodi Kathi Case: కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసు విచారణను ఎన్‌ఐఏ కోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది. ఉదయం ఎన్‌ఐఏ కోర్టు ముందుకు ఈ కేసు విచారణకు రాగా.. జగన్ తరపు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఎన్‌ఐఏ, నిందితుడి తరపున న్యాయవాదులు వేసిన కౌంటర్‌లపై న్యాయవాది వెంకటేశ్వర్లు వాదించారు. ఈ కేసులో ఫైనల్ రిపోర్ట్ వెయ్యనందున సామాన్యూలు ఎవరైనా విచారణ ఇంకా జరుగుతూనే ఉందనుకుంటారని తెలిపారు.
ఈకేసులో ఎన్ఐఏ సరిగ్గా దర్యాప్తు చేయలేదని కోర్టు తెలిపామన్నారు. రెస్టారెంట్ ఓనర్ డిక్లరేషన్ ఇచ్చారని.. అధికారులు సరైన నిబంధనలు పాటించకుండా ఎయిర్ పోర్ట్ ఎంట్రీ పాస్ ఇచ్చారని వాటిపై ఎన్ఐఏ దర్యాప్తు చేయలేదన్నారు. బాధితునిగా సీఎం జగన్‌కు ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేయించాలని అడిగే హక్కు ఉంటుంది అంటూ వాదనలు వినిపించారు.