Kodali Nani: చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని.. విమర్శలపై క్లారిటీ
Kodali Nani: ఎవరి జోలికి వెళ్లని చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడిని కాదు
Kodali Nani: కృష్ణా జిల్లా గుడివాడలో చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని కేక్ కట్ చేశారు. చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలని కొడాలి నాని ఛాలెంజ్ విసిరారు. ఎవరి జోలికి వెళ్లని చిరంజీవి విమర్శించే సంస్కారహీనుడిని కానన్నారు. డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్లకు చిరంజీవి సలహాలు ఇవ్వాలని అన్నాను..ఈ వ్యాఖ్యలు చిరంజీవి గురించి మాట్లాడినట్లు ఎట్లా అవుతుందని కొడాలి నాని అన్నారు.