నారా లోకేష్‌పై మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ లాంటి వ్యక్తిని తాను ఎక్కడా చూడలేదని.. వరి చేనుకు.. చేపల చెరువుకు తేడా తెలియని వ్యక్తి అంటూ ఎద్దెవా చేశారు. సీఎంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కరెంటు చార్జీలు తగ్గించమంటే.. రైతులపై పోలీసులతో కాల్పులు జరిపించాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇప్పుడు రైతులకు సంకెళ్లు వేశారని దేవినేని ఉమా సంకెళ్ల నాటకం ఆడుతున్నారు. అప్పుడు బషీగ్ బాగ్ ఘటన సమయంలో ఉమా గన్‌తో ఎందుకు కాల్చుకోలేదు. గుంటూరులో జరిగిన ఘటనలో రైతులు పోలీస్ సిబ్బంది మీద తిరగబడితే సంకెళ్లు వేశామని చెప్పారు. వారిపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. అమరావతిలో మాత్రమే రైతులున్నట్లు బాబు వ్యవహరిస్తున్నారు. అమరావతిలో కొన్న భూముల ధరలు పడిపోయాయని రైతులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు బృందం రాద్దాంతం చేస్తోంది అని అన్నారు.