2019 Exit Polls: అంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2019లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి..?

AP Exit Polls: అంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2019లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి..?

Update: 2024-06-01 11:24 GMT

2019 Exit Polls: అంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2019లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి..?

AP Exit Polls: అంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2019లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి..? వాస్తవ ఫలితాలు ఎలా వచ్చాయి.? ఎన్ని సంస్థలు ఎగ్జాక్ట్ ఫిగర్‌కు దగ్గరిగా ఫలితాలను వెల్లడించాయో ఓసారి చూద్దాం.

నేషనల్ ఛానెల్‌ టైన్స్ నౌ సర్వే సంస్థ 2019లో వైసీపీకి 98 సీట్లు, టీడీపీకి 65స్థానాలు, జనసేనకు 2సీట్లు మాత్రమే వస్తాయని తన ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది.

అలాగే ఇండియా టూడే వైసీపీకీ 130 నుంచి 135 వరకు సీట్లు వస్తాయని అంచనా వేసింది. అదే టీడీపీకి 37 నుంచి 40 వరకు, జనసేనకు 0 నుంచి ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంటుందని ఇండియా టూడే తన ఎగ్జిట్ పోల్స్ సర్వేలో పేర్కొంది.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 127 సీట్లు వస్తాయని ఆరా సర్వే సంస్థ అంచనా వేసింది. టీడీపీకి 47, ఇతరులకు నుంచి 2సీట్లు వస్తాయని ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్‌లో పేర్కొంది.

ఇక సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ సంస్థ.. 2019అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 133 నుంచి 135, టీడీపీకి 37 నుంచి 40, జనసేనకు 0 నుంచి 1 ఒక సీటు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.

మిషన్ ఛాణక్య సర్వే సంస్థ.. 2019లో వైసీపీకి 105 సీట్లు, టీడీపీకి 61, ఇతరులు 9 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్‌లో అంచనా వేసింది.

ఐతే సర్వే సంస్థల అంచనాలను మించి 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. వైసీపీకి ఏకంగా 151సీట్లు, టీడీపీకి 23సీట్లు, జనసేనకు 1 సీటు వచ్చింది. ఐతే 2019 అసెంబ్లీలో ఎగ్జిట్ పోల్స్‌ అన్నీ వైసీపీకే మెజార్టీ కట్టబెట్టినా..ఎవరూ వాస్తవ ఫలితాలను ఇవ్వలేదనే చెప్పాలి. అత్యధికంగా వైసీపీకి 135సీట్లువ వస్తాయని అంచనా వేయగా.. ఏకంగా జగన్ పార్టీ 151సీట్లను కైవసం చేసుకుంది. ఇండియా టూడే వైసీపికి గరిష్టంగా 135వస్తుందని చెప్పింది. ఆరా స్థంస్థ 127సీట్లు వస్తాయని అంచనా వేసింది. సీపీఎస్ గరిష్టంగా 133 సీట్లు వస్తాయని చెప్పింది. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి యావరేజ్‌గా 40నుంచి 50సీట్లు వస్తాయని చెప్పగా.. టీడీపీకి కేవలం 23సీట్లే వచ్చాయి.

Tags:    

Similar News