జగన్ బెయిల్ రద్దు పిటిషన్: సుప్రీంలో కీలక పరిణామం

S Jagan: ఆస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.

Update: 2024-11-12 05:44 GMT

జగన్ బెయిల్ రద్దు పిటిషన్: సుప్రీంలో కీలక పరిణామం

YS Jagan: ఆస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. జడ్జి నాట్ బి ఫోర్ మీ అనడంతో ఈ పిటిషన్ పై విచారణను వేరే ధర్మాసనానికి బదిలీ చేశారు. 2024, డిసెంబర్ 2న జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఎదుట ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది.

ఈ పిటిషన్ పై విచారణను గతంలో కూడా నాట్ బి ఫోర్ మీ అని సంజయ్ కుమార్ చెప్పారు. ఇవాళ ఈ పిటిషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కుమార్ కూడా సభ్యులు. విచారణ ప్రారంభం కాగానే  ఈ పిటిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిందని జగన్ తరపు న్యాయవాది బెంచీ దృష్టికి తెచ్చారు. దీంతో జస్టిస్ సంజయ్ కుమార్ నాట్ బి ఫోర్ మీ అన్నారు. పొరపాటున ఈ పిటిషన్ సంజయ్ కుమార్ ఉన్న బెంచీ వద్దకు వచ్చిందని సీజేఐ ఖన్నా చెప్పారు. జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరపనుందని సీజేఐ ఖన్నా ప్రకటించారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.

రఘురామకృష్ణంరాజు పిటిషన్ ఏంటి?

హైద్రాబాద్ లోని సీబీఐ ప్రత్యేక ధర్మాసనం జగన్ ఆస్తుల కేసును విచారిస్తోంది. విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందని.. ఈ విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు జగన్ బెయిల్ ను రద్దు చేయాలని వేర్వేరు పిటిషన్లను ఆయన దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. కానీ, జడ్జి నాట్ బి ఫోర్ మీ అనడంతో విచారణ వాయిదా పడింది.

సమయం కోరిన సీబీఐ

జగన్ తరపు న్యాయవాది వాదనల తర్వాత సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ఈ విషయమై కౌంటర్ దాఖలు చేయడానికి మరింత సమయం కావాలని కోరారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న సీజేఐ సంజీవ్ ఖన్నా ఈ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది.

Tags:    

Similar News