AP TET 2024: ఏపీ టెట్ షెడ్యూల్ లో మార్పులు...కొత్త తేదీలివే..

AP TET 2024: ఏపీ టెట్ షెడ్యూల్ లో మార్పులు...కొత్త తేదీలివే..

Update: 2024-07-08 13:42 GMT

AP TET 2024: ఏపీ టెట్ షెడ్యూల్ లో మార్పులు...కొత్త తేదీలివే..

AP TET 2024: ఆంధ్రప్రదేశ్ లో టెట్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్రంలో ఎన్ డీ ఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టెట్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ నెల 2న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే టెట్, డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్షా తేదీల్లో మార్పులు చేయాలని అభ్యర్ధుల నుండి వినతులు వచ్చాయి. ఈ వినతుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం టెట్ షెడ్యూల్ లో మార్పులు చేసింది.

రాష్ట్రంలో 16, 347 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం డీఎస్సీని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 2న విడుదల చేసిన నోటిఫికేషన్ మేరకు ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించాలని ప్రకటించారు. అయితే తాజాగా టెట్ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేసింది ఏపీ ప్రభుత్వం. ఆగస్టులో కాకుండా అక్టోబర్ 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Tags:    

Similar News