Mudragada Takes Sensational Decision : కాపు రిజర్వేషన్ల ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. ఈ మేరకు కాపు సామాజిక వర్గానికి ఆయన లేఖ రాయడం సంచలనం రేకేత్తిస్తోంది. ముద్రగడ పద్మనాభం రాసిన లేఖ యధాతదం గా..
బహిరంగ లేఖ సారాంశం:
మన పెద్దలు మన సోదరుల చేత నేను మానసికంగా కృంగిపోయేలా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాడులు చేయిస్తున్నారు. అవకాశవాది, గజదొంగ, కులద్రోహి, అంటూ నానా రకాలుగా తిట్టిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒంటికాలిపై లేచిన ముద్రగడకు ఇప్పుడు కాళ్ళు పడిపోయాయా అని పోస్టింగులు పెడుతున్నారు. ఇవన్నీ చూసి కలత చెంది నేను ఉద్యమం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఉద్యమం ద్వారా నేనేమీ సాధించలేదని, పేరు చెప్పకుండా పదిమంది తో తిట్టిస్తూ, ఫలాల సాధనలో నేను సరిగా నడవలేదని చెప్పించే వారినే డ్రైవర్ సీటులో కూర్చుని రిజర్వేషన్లు సాధించాలని కోరుతున్నాను. నేను ఉద్యమంలోనికి రావడానికి కారణం చంద్రబాబు.
రిజర్వేషన్లు పై చంద్రబాబు మాట తప్పారు కాబట్టి ఉద్యమం చేపట్టాను. ఉద్యమ కాలంలో నేను వసూలు చేసిన నిధులు వారికి పంచలేదని కోపంతో ఈ దాడులు చేయిస్తున్నారా..? నేను ఉద్యమంలో ఆర్ధికంగా, రాజకీయంగా ఆరోగ్య పరంగా నష్టపోయాను. ఫలాల సాధన కోసం వివిధ మార్గాల్లో ప్రయత్నించాను. డబ్బు,పదవులు ఆశించి ఈ ఉద్యమం ప్రారంభించలేదు. ఉద్యమం ద్వారా ఎంత నష్టపోయానో అందరికీ తెలుసు. అయినా జరిగిన నష్టానికి ఏనాడూ చింతించలేదు. తుని సభ, పాదయాత్ర ఘనంగా జరగడం నా గొప్పతనం కాదు, మన జాతి ఆకలి అన్న సంగతి గమనించండి. ఉద్యమం లో పరిస్థితి ని బట్టి మెరుగైన ఫలితాల సాధన కోసం రకరకాల ఆలోచనలతో ముందుకు వెళతాము. ఒకే ఆలోచన తో ఎప్పుడూ ఉద్యమం ముందుకు వెళ్ళదు. జాతికి మంచి జరగాలని ఎన్నో ప్రయత్నాలు చేసాను. ఆ ప్రయత్నాలు తప్పు అనడం న్యాయంగా లేదు. నా రాజకీయ జీవితంలో అనేక పార్టీలు,కుల సభలు చూశాను.
తుని సభకు రెండురోజుల ముందే జనం చేరుకోవడం ఆనందాన్నిచ్చింది. రిజర్వేషన్లు ఇచ్చేస్తే ఆ పేరు నాకే వచ్చేస్తుందని ఆశించేవాడ్ని కాదు. రిజర్వేషన్లు ఇచ్చేస్తే నేను గొప్పవాడ్ని అయిపోతానని అభిప్రాయాలు పడ్డారు. జేఏసీ, అడ్వకేట్స్, మేధావుల సూచనలమేరకే ఉద్యమాన్ని నడిపాను. ఉద్యమం లో మెరుగైన ఫలితాలు కోసం రకరకాల ఆలోచనలతో ముందుకు వెళతాం. ఒకే ఆలోచన తో ఏ ఉద్యమం ముందుకు సాగదు. ఏదో రూపంలో జాతికి మంచి జరగాలన్నదానిపై ఎన్నో ప్రయత్నాలు , ఉద్యమాలు చేశాం. అవన్నీ కూడా తప్పు అనడం న్యాయం గా లేదు. కులద్రోహి, గజదొంగలా మాట్లాడారట. తప్పదు పోస్టింగులు పెడుతున్నారు. ఇవన్నీ చూసి కలత చెంది ఉద్యమం నుంచి ప్రక్కకు తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. ఉద్యమం ద్వారా నేనేమి సాధించలేదని, రోజూ పేరు చెప్పకుండా పదిమందితో తిట్టిస్తున్నారు. డ్రైవరు సీటులో వారే కూర్చుని జాతికి నేను తీసుకురాలేని రిజర్వేషన్లు వచ్చేలా చేయమని, మడుగులో కూర్చుని ఇతరులచేత నన్ను తిట్టించే వారిని కోరుతున్నాను.
ముద్రగడ పద్మనాభం