Adapa Seshu: పవన్‌కల్యాణ్‌పై కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు ఆగ్రహం
Adapa Seshu: పవన్‌కు మహిళలంటే గౌరవం లేదన్న అడపా శేషు
Adapa Seshu: పవన్‌కల్యాణ్ చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలా మారారని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు విమర్శించారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని పవన్ తాపత్రాయపడుతున్నారన్నారు. పవన్ కుటుంబాన్ని ఎక్కువగా తిట్టింది టీడీపీ వాళ్లేనని, ప్యాకేజీ మాయలో పడి పవన్ అంతామరిచిపోయాడన్నారు. చంద్రబాబు, పరిటాల రవి చేసిన అవమానాలు ఎలా మరిచిపోతారని అడపా శేషు ప్రశ్నించారు. పవన్ ద్వారా చంద్రబాబు దుర్మార్గమైన రాజకీయాలకు తెరతీశాడన్నారు.