Kurasala Kannababu: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైసీపీ గెలుపు ఖాయం
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కూటమి పోటీ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
Kurasala Kannababu: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వైసీపీ గెలుపు ఖాయమన్నారు కురసాల కన్నబాబు. వైసీపీకి బలం ఉన్నా టీడీపీ ఎందుకు బరిలోకి దిగుతోందన్న ఆయన.. నైతికత లేని రాజకీయం చేయడానికి టీడీపీ సిద్ధమైందని ఆరోపించారు. తమ ఓటర్లను ప్రలోభపెట్టాలని టీడీపీ చూస్తోందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీదే విజయమన్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కూటమి పోటీ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అచ్యుతాపురం మండలంలోని కొండకర్ల గెస్ట్ హౌస్‌లో శుక్రవారం వైసీపీ ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో నిర్వహించిన సమవేశంలో మాట్లాడారు. వైసీపీకి 600 ఓట్లు ఉండగా, కూటమికి కేవలం 200 ఓట్లు మాత్రమే ఉన్నాయని తెలిపారు. తక్కువ ఓట్లు కలిగిన కూటమి ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు. వైసీపీ పక్షాన ఉన్న ఓటర్లను ప్రలోభపెట్టే యోచనతోనే కూటమి అభ్యర్థిని నిలబెడుతుందని తెలిపారు.