నిమ్మగడ్డ నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు : కాకాణి

*పంచాయతీరాజ్ మంత్రిని నిలువరించాలనుకోవడం తప్పు :కాకాణి *ఇదే విషయంపై పోరాటానికి ఎంత దూరమైనా వెళతాం: కాకాణి *నిమ్మగడ్డ నిర్ణయాలతో ఎలక్షన్ కమిషన్ అభాసుపాలవుతోంది: కాకాణి

Update: 2021-02-06 13:00 GMT

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఎన్నికల కమిషన్ అభాసుపాలవుతోందని ఏపి అసెంబ్లీ ప్రివిలైజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.పంచాయతీ రాజ్ మంత్రిని తన ఆదేశాలతో కట్టడి చేయాలనుకోవడం మూర్ఖత్వమని ఇది అప్రజాస్వామికం, దురదృష్టకరమని అన్నారు. ఎన్నికల కోసం యాప్ ప్రవేశపెట్టి ఇప్పటికే కోర్టులో నిమ్మగడ్డను తప్పుపట్టిందని కాకాణి పేర్కొన్నారు. పెద్దిరెడ్డి పై జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోకపోతే న్యాయాపోరాటానికి వెళతాం అన్నారు కాకాణి. పంచాయితీ ఎన్నికల్లో శాంతి సామరస్యంగా జరిగే ఏకగ్రీవాలను నిలిపివేయాలని ఉత్తర్వులు ఇవ్వడం మంచిపద్దతి కాదన్నారు గోవర్ధన్ రెడ్డి.

Tags:    

Similar News