YS Avinash Reddy Tests Covid Positive: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్...

YS Avinash Reddy Tests Covid Positive: కరోనా ఎవరిని వదలడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ కరోనా బారిన పడుతున్నారు.

Update: 2020-08-30 15:12 GMT

YS Avinash Reddy Tests Covid Positive: కరోనా ఎవరిని వదలడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరూ కరోనా బారిన పడుతున్నారు. ఇక ఏపీలో కూడా పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. అదేవిధంగానే కడప ఎంపి వైయస్ అవినాష్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్దంతి సందర్భంగా సిఎం జగన్ సెప్టెంబర్ 1,2 తేదీలలో ఇడుపులపాయ సందర్శన సందర్భంగా, ఈ కార్యక్రమానికి హాజరైన వైయస్ కుటుంబ సభ్యులు, బంధువులు, మీడియా ప్రతినిధులకు వైద్యులు కరోనావైరస్ పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో, అవినాష్ రెడ్డి కరోనావైరస్ పరిక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

అయితే,గత కొన్ని వారాల నుండి అతనితో తిరుగుతున్న వారికి కరోనావైరస్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇక అటు ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి.. గడిచిన 24 గంటల్లో 10,603 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 63,077 శాంపిల్స్‌ని పరీక్షించగా 10,603 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 9,067 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొవిడ్‌ కారణంగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు 12, నెల్లూరు 14, కడప 09, అనంతపురం 07, తూర్పుగోదావరి 06, పశ్చిమగోదావరి 07, శ్రీకాకుళం 06, కర్నూలు 05, విజయనగరం జిల్లాలో 05, కృష్ణా 05, గుంటూరు 04, ప్రకాశం 04, విశాఖపట్నం 04, చొప్పున మరణించారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసులు 4,24,767. ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3,884. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 3,21,754కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 99,129 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఏపీలో 36,66,422 కరోనా శాంపిల్స్ నిర్వహించింది ప్రభుత్వం.


Tags:    

Similar News