Anantapur: చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతికేకిస్తూ జేసి నిరసన
Anantapur: అనంతపురం జిల్లా తాడిపత్రిలో నల్లదుస్తులు ధరించి జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసన
Anantapur: అనంతపురం జిల్లా తాడిపత్రిలో చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి నల్లదుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంజీవ్ నగర్ లో ఉన్న శ్రీ గాయత్రీ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన చంద్రబాబుకు త్వరగా బెయిల్ రావాలని అమ్మవారిని ప్రార్థించారు.