JC Prabhakar Reddy: టీడీపీ పేరుతో వైసీపీ వారు నామినేషన్లు వేశారు
Andhra pradesh: గతేడాది వైసీపీ నేతలు బెదిరింపులతో తమ పార్టీ టీడీపీ సభ్యలు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారన్నారు.
Andhrapradesh: వైసీపీ నేతలు ఊర్లోకి రాకుండా చేసి.. తనలాంటి వ్యక్తులకే నామినేషన్ వేయలేని పరిస్థితిని తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. కలెక్టర్‌ను కలిసిన అనంతరం జేసీ మీడియాతో మాట్లాడారు. మాజీ మున్సిపల్ చైర్మన్ నామినేషన్ పత్రాన్ని చించేశారన్నారు. టీడీపీ పేరుతో వైసీపీకి చెందిన వారు నామినేషన్లు వేశారని ఆరోపించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల(Municipal Elections) నిర్వహణలో వార్డు వాలంటీర్లను ఉపయోగించకూడదని జేసీ ప్రభాకర్‌రెడ్డి కోరారు. గతేడాది వైసీీీపీ నేతలు బెదిరింపులతో తమ పార్టీ టీడీపీ సభ్యలు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారని, మళ్లీ అవకాశమివ్వాలని కలెక్టర్‌ను కోరినట్లు చెప్పారు.
ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశానన్నారు. వాలంటీర్లంతా వైసీపీ నేతల్లా వ్యవహరిస్తున్నారని జేపీ ఆరోపించారు. ఓటేయకపోతే పథకాలు ఆపేస్తామంటూ వాలంటీర్లు ప్రజలను బెదిరిస్తున్నారని.. వారి వ్యవహారశైలి అలాగే ఉంటే రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య వస్తుందని జేసీ (JC PRABAKAR Reddy)ఆరోపించారు.