Online Classes: బీటెక్ విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు.. ఆగష్టు 17 నుంచి ప్రారంభం

Online Classes: కరోనా ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితుల్లో కాలేజీలు అనువైన విధంగా క్లాసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Update: 2020-08-14 02:46 GMT
Online Classes

Online Classes: కరోనా ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితుల్లో కాలేజీలు అనువైన విధంగా క్లాసులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీరికి ఆన్ లైన్ ద్వారా తరగతులు నిర్వహించేందుకు పాత విద్యార్థులకు అవకాశం కల్పించింది. ఈ నెల 17 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించి, క్రమంగా ఇతర తరగతులకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజనీరింగ్‌ పాత విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆగస్టు 17 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. బీటెక్‌, బీ.ఫార్మసీ కోర్సుల రెండు, మూడు, నాలుగో సంవత్సరపు విద్యార్థులతో పాటు ఎంబీఏ, ఎంటెక్‌, ఎంసీఏ తదితర కోర్సుల పాత విద్యార్థులకు కూడా అదే రోజు నుంచి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తారు. ఈ మేరకు జేఎన్‌టీయూకే, జేఎన్‌టీయూఏలు నిర్ణయించాయి. 2020-21 విద్యా సంవత్సరంలో తొలిసారి అడ్మిషన్‌ పొందే విద్యార్థులకు తప్ప మిగిలిన విద్యార్థులకు ఏఐసీటీఈ ఈ నెల 17 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించుకునేందుకు విశ్వవిద్యాలయాలకు తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రెండు సాంకేతిక విశ్వవిద్యాలయాలు కూడా ఏఐసీటీఈ బాటలోనే నడవాలని నిర్ణయించాయి.

ఇక, సెప్టెంబర్‌ మొదటి వారం (3వ తేదీ) నుంచి ఫైనలియర్‌ పరీక్షలు నిర్వహించాలని జేఎన్‌టీయూఏ భావిస్తోంది. విద్యార్థులందరినీ ఒకేసారి కాకుండా బ్యాచ్‌ల వారీగా చేసి ఫైనలియర్‌ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. సెమిస్టర్‌ పరీక్షల్లో ఈ సారి జంబ్లింగ్‌ విధానాన్ని ఎత్తి వేయాలని ఆయా వర్సిటీలు నిర్ణయించాయి. ఇదిలా ఉండగా అక్టోబర్‌లో ఫిజికల్‌ క్లాస్‌ వర్క్‌ ప్రారంభించాలని ఏఐసీటీఈ స్పష్టం చేసినందున అక్టోబర్‌ 15 నుంచి రెగ్యులర్‌ తరగతులను ప్రారంభించేందుకు ఇప్పటికే సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే విద్యా సంవత్సరంలో కొన్ని రోజులు కోల్పోయిన నేపపథ్యంలో వారంలో ఆరు రోజుల పాటు తరగతులు నిర్వహించాలని జేఎన్‌టీయూకే భావిస్తోంది.  

Tags:    

Similar News