Pawan Kalyan: 100% స్ట్రయిక్ రేట్‌తో జన సేనాని కొత్త రికార్డ్

ఆంధ్రప్రదేశ్‌లో 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. ఈ విజయంతో ప్రజలు తన మీద చాలా పెద్ద బాధ్యతను పెట్టారని పవన్ అన్నారు.

Update: 2024-06-04 16:30 GMT

Pawan Kalyan: 100% స్ట్రయిక్ రేట్‌తో జన సేనాని కొత్త రికార్డ్

పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన అరుదైన ఘనత జనసేన పార్టీ సొంతం చేసుకుందని జూన్ 4 ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్‌లో చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. ఈ విజయంతో ప్రజలు తన మీద చాలా పెద్ద బాధ్యతను పెట్టారని పవన్ అన్నారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు గెలిచినంత బాధ్యతను ప్రజలు తమ మీద పెట్టారని పవన్ అన్నారు.

గత ఎన్నికల్లో ఒకే సీటును గెల్చుకున్నప్పటి తన మానసిక స్థితి, ఇప్పుడు అన్ని స్థానాలు గెల్చిన తరువాత ఉన్న మానసిక స్థితి ఒకటేనని పవన్ కల్యాణ్ అన్నారు. ఓటమితో పాఠాలు నేర్చుకున్నానే తప్ప నిరాశపడలేదేన్నారు. ధర్మం కోసం నిలబడితే, ధర్మం తనను గెలిపిచిందని, కనిపించని దేవుళ్ళందరికీ ఈరోజున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పవన్ చెప్పారు. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు, కదం తొక్కిన జన సైనికులకు, యువతకు, తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.

ఇది కక్ష సాధింపు కోసం లభించిన విజయం కాదు. జనం కోసం నిలబడేందుకు, జనం కష్టాలు తీర్చేందుకు లభించిన అవకాశమని పవన్ అన్నారు. నేను మీ కుటుంబసభ్యునిగా అసెంబ్లీలోకి అడుగుపెడతాను, మీ తరఫున పని చేస్తానని హామీ ఇస్తున్నానని చెప్పిన పవన్ అధికారం ఎలా ఉండాలో రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకు చూపిస్తానని పవన్ అన్నారు. అధోగతి పాలైన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని కూడా జనసేనాని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News