Janasena MLA on Pawan Kalyan:పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు
Janasena MLA on Pawan Kalyan:జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ తన పార్టీ అధినేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయనే విజయం సాధించలేదు అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. జనసేన తరుఫున గెలిచి అధికార పక్షం తరఫున మాట్లాడే ఎమ్మెల్యే రాపాక మరోసారి జనసేన పార్టీపై.. పార్టీ అధినేత పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాజోలు నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలోనె అభివృద్ధి జరిగిందనీ..ఇప్పుడు మళ్ళీ జగన్ హయంలో అభివృద్ధి జరుగుతోంది అన్నారు.
2019లో వైఎస్సార్‌సీపీ తరపున టికెట్ కోసం ప్రయత్నించానని.. టికెట్ ఇవ్వడానికి జగన్ కూడా ఒప్పుకున్నారని చెప్పారు. అయితే తప్పనిసరి పరిస్థితిలో రాజేశ్వరరావుకు వైసీపీ టికెట్ ఇచ్చారన్నారు. ఈ పరిస్థితిలో తాను ఖాళీగా కూర్చొని ఉంటే జనసేనకు సంబంధించిన కొందరు తన ఇంటికి వచ్చి పార్టీలో చేరమని ఆహ్వానించారని రాపాక చెప్పారు.
గతంలో రాజోలు నియోజకవర్గంలో ఎస్సీ ఓటింగ్ ఎక్కువ ఉండేదనీ, ఇప్పుడు కాపుల ఓటింగ్ పెరిగిందన్నారు. తర్వాత తాను జనసేన పార్టీలోకి వెళ్లానని చెప్పారు. తాను గెలిచిన తర్వాత జగన్‌ను కలిశాను అని తెలిపారు. ఆ సమయంలో టికెట్ ఇవ్వలేకపోయానని సీఎం తనతో అన్నారన్నారు. అయినా ఫర్వాలేదు..సరే కలిసి పని చేద్దామని చెప్పారని తెలిపారు. అప్పటి నుంచి కలిసి పనిచేస్తున్నామన్నారు. రాజోలు నియోజకవర్గానికి సీఎం జగన్ నిధులు కేటాయించారన్నారు వరప్రసాద్.
తాను నెగ్గిన పార్టీ నిలబడేది కాదు.. ఉంటుందో లేదో కూడా తెలియదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.