Pawan Kalyan Praises AP CM YS Jagan: సీఎం జగన్ పై పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు!

Pawan Kalyan Praises AP CM YS Jagan: ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న సమయంలో ప్రజల కోసం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరు పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2020-07-03 14:19 GMT
YS Jagan, Pawan Kalyan (File Photo)

Pawan Kalyan Praises AP CM YS Jagan: ప్రపంచమంతా కరోనాతో పోరాడుతున్న సమయంలో ప్రజల కోసం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరు పట్ల ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.. తాజాగా ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో రూ. 203 కోట్ల ఖర్చుతో ఒక వెయ్యి 88 , 108, 104 వాహనాలను కొనుగోలు చేసిన విషం తెలిసిందే.. వీటిని గత బుధవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ లోని బెంజ్‌ సర్కిల్‌లో సీఎం జగన్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.

అయితే దీనిపైన సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సీఎం జగన్ పైన ప్రశంసల జల్లు కురిపించారు. " ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి గారు, అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులిని, ప్రస్తుతం ఉన్న అత్యవసర పరిస్థితుల్లో ఆరంభించడం, అభినందనీయం అంటూ పవన్ పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న తీరు పట్ల పవన్ హర్షం వ్యక్తం చేశారు. "గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో , ఏ మాత్రం అలసత్వం ప్రదిర్శించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు అభినందనీయం" అంటూ పవన్ ట్వీట్ చేశారు.

ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 108, 104 వాహనాలు.. గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ ప్రమాదం జరిగిన ఫోన్ వచ్చిన వెంటనే 15, 20 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకోనున్నాయి. ప్రతి అంబులెన్సును ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌తో అనుసంధానం చేయడం ద్వారా ఫోన్‌ చేసిన వారిని వేగంగా ట్రాక్‌ చేసే వీలు ఉంటుంది. అంతేకాదు ప్రతి అంబులెన్సులోనూ ఒక కెమెరా, ఒక మొబైల్‌ డేటా టెర్మినల్‌, రెండు వైపులా మాట్లాడుకునే విధంగా ఆటోమేటిక్‌ వెహికిల్‌ లొకేషన్‌ టాండ్‌ బాక్స్‌ను ఏర్పాటు చేశారు.

ఈ వాహనాల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బీఎల్ఎస్‌ అంబులెన్సులలో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్, వీల్‌ చైర్, బ్యాగ్‌ మస్క్, మల్టీపారా మానిటర్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఏఎల్ఎస్‌ అంబులెన్సులలో విషమ పరిస్థితిలో ఉన్న రోగిని ఆస్పత్రికి తరలించే సమయంలో వైద్య సేవలందించేలా లెటెస్ట్ టెక్నాలజీతో కూడిన వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. ఇటు చిన్నారులకు వైద్యం అందించే నియోనేటల్‌ కేర్ అంబులెన్సులలో ఇన్‌క్యుబేటర్లతో పాటు వెంటిలేటర్లను తీర్చిదిద్దారు. 



Tags:    

Similar News