Pawan Kalyan: ఎన్డీఏ సమావేశానికి జనసేనానికి ఆహ్వానం.. ఈ నెల 18న ఢిల్లీలో ఎన్డీఏ సమావేం
Pawan Kalyan: ఎన్డీయే భాగస్వామ్య సమావేశానికి హాజరుకావాలని పవన్ కళ్యాణ్‌కి ఆహ్వానం
Pawan Kalyan: ఢిల్లీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సమావేశం కానున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలను కూడగట్టే ప్రయత్నంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల సమావేశానికి హాజరుకావాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కి ఆహ్వానం పంపారు. దీంతో ఈ నెల 18న ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశానికి పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరవుతారు. ఈ నెల 17 సాయంత్రానికి ఢిల్లీ చేరుకుని, మరుసటిరోజు జరిగే ఎన్డీయే భాగస్వామ్య సమావేశానికి హాజరుకావాలని పవన్ కళ్యాణ్ యోచిస్తున్నారు.