Jai Bharath National Party: అన్నివర్గాల ప్రజల శ్రేయస్సు కోసమే మ్యానిఫెస్టోc
Jai Bharath National Party: అన్నివర్గాల ప్రజల శ్రేయస్సు కోసమే మ్యానిఫెస్టో
Jai Bharath National Party: జై భారత్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను విజయవాడలో రిలీజ్ చేశారు ఆ పార్టీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ. విద్యార్థి, ఆటో డ్రైవర్, మహిళలు, రైతు ద్వారా మ్యానిఫెస్టోను అందుకున్నారు. ఓటు ప్రాధాన్యతను తెలిపే.. ఓటర్ల దినోత్సవం సందర్భంగా మ్యానిఫెస్టోను రిలీజ్ చేశామన్నారు లక్ష్మీనారాయణ. తమ పార్టీ ప్రజల నుంచి పుట్టిందని.. అందుకే ప్రజల మ్యానిఫెస్టోగా ప్రకటించామన్నారు. అన్ని వర్గాల ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా మ్యానిఫెస్టో రూపొందించినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..
స్వామినాథన్ ఉపాధి హామీ కింద ప్రతినెలా రైతులకు ఐదు వేలు
రైతు పండించే పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.
సామాజిక వర్గాల పేరుతో రైతన్నలను జైభారత్ పార్టీ విడదీయదు
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి.. వారికి రుణాలు ఇచ్చేలా చేస్తాం
రైతులకు వడ్డీ లేని రుణాలు.. చట్టబద్దంగా రైతు కమిషన్ ఏర్పాటు
విత్తన చట్టం తెస్తామని పదేళ్లుగా కేంద్రం చెబుతున్నా.. దానిని తీసుకు రావడం లేదు
రాష్ట్రస్థాయిలో విత్తన చట్టం తీసుకువచ్చి అమలు చేస్తాం
ప్రకృతి వైపరిత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు పదిహేను వేలు.. పదిహేను రోజుల్లో చెల్లించే ఏర్పాటు చేస్తాం
ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించేలా పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం
ప్రతి నియోజకవర్గంలో ఒక భారీ పరిశ్రమ నెలకొల్పుతాం
సొంత ప్రాంతాల్లోనే ఉపాధి మార్గాలను చూపిస్తాం
పట్టణ ఉపాధి హామీ పథకం కూడా అమలు చేస్తాం
ఏడాదిలో వంద రోజులు ఉపాధి హామీ కింద పనులు అప్పగిస్తాం
జైభారత్ పార్టీ ప్రతి ఏడాది జనవరి 26న రిపబ్లిక్ రోజున గ్రూపు వన్, గ్రూప్ టూ నోటిపికేషన్, సెప్టెంబర్ లో ఉపాధ్యాయ పోస్టులు, అక్టోబర్ 21 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాం
అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తాం.