CM Jagan: మాది ఎగ్గొట్టే ప్రభుత్వమే అయితే... మూడేళ్లలోనే 95శాతం హామీలు అమలు చేస్తామా?
CM Jagan: కొందరు రూ.2000 కేటాయింపు విమర్శలు చేస్తున్నారు
CM Jagan: ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు సీఎం జగన్. టాయిలెట్లు పరిశుభ్రత కోసం TMF ఫండ్ ఏర్పాటు చేశామని చెప్పారు. దీని కోసం అమ్మ ఒడికి ఇస్తున్న సొమ్ములో నుంచి వెయ్యి రూపాయిలు కేటాయిస్తున్నామని జగన్ తెలిపారు. స్కూళ్ల నిర్వహణ కోసం SMF ఫండ్ ఏర్పాటు చేశామని దీని కోసం అమ్మఒడికి ఇస్తున్న దాంట్లో నుంచి మరో వెయ్యి కేటాయించామని జగన్ చెప్పారు.
అమ్మఒడి నుంచి స్కూళ్ల అభివృద్ధి కోసం రెండు వేల రూపాయిలు కేటాయించడంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని జగన్ తెలిపారు. విమర్శలు చేసే ఏ ఒక్కరైనా, చదివించే తల్లికి అమ్మ ఒడి ద్వారా ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. తమది ఎగ్గొట్టే ప్రభుత్వమే అయితే అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో 95శాతం హామీలు అమలు చేస్తామని అని చెప్పారు.