Jagananna Pacha Thoranam Starts in AP : జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం ప్రారంభం

Update: 2020-07-22 06:09 GMT

Jagananna Pacha Thoranam Starts in AP : ఏపీలో జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం ప్రారంభమయ్యింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్​ లాంఛనంగా ప్రారంభించారు. 71వ వనమహోత్సవంలో భాగంగా పేద ప్రజలకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో ముఖ్యమంత్రి జగన్ మొక్కలు నాటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వేప, రావి మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 17వేల లే అవుట్లు వేసి 30లక్షల మంది పేదలకు ఫ్లాట్లు ఇస్తున్నామని అన్ని చోట్ల ఈ రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 20కోట్ల మొక్కల నాటాలని నిర్ణయించామన్నారు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించేలా కృషి చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ''మొక్కలు నాటి.. వాటిని కాపాడుతామని.. పచ్చదనాన్ని వెల్లివెరిసేలా చేస్తామని, ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేస్తామని'' మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజల చేత సీఎం జగన్‌ ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బాలినేని శ్రీనివాస్ రెడ్డి , కొడాలి నాని , పేర్ని నాని , వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ , సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం , మహిళాకమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





Tags:    

Similar News