CM Jagan: నేడు జగనన్న తోడు కింద నిధులు విడుదల
CM Jagan: లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్న సీఎం జగన్
CM Jagan: ఏపీ వ్యాప్తంగా చిరువ్యాపారులకు చేయూతనందించడానికి సీఎం జగన్ ప్రవేశపెట్టిన ‘జగనన్న తోడు’ 7వ విడత కార్యక్రమం ఇవాళ జరగనుంది. ఈ కార్యక్రమంలో 5 లక్షల,10వేల,412 మందికి ప్రభుత్వం మరో విడత వడ్డీ లేని 549.70 కోట్ల రుణాలను అందజేయడంతో పాటు గతంలో ఈ పథకం ద్వారా రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన వారికి 11.03 కోట్ల వడ్డీ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారు.