CM Jagan: కేంద్రం డబ్బులిస్తుంది కాబట్టి వారు చెప్పినట్టు చేయాల్సిందే
CM Jagan: కేంద్రం ఇచ్చే ప్యాకేజీకి రాష్ట్రం మరికొంత కలిసి ఇస్తుంది
CM Jagan: గత ప్రభుత్వాల కంటె భిన్నంగా వరద బాధితులను ఆదుకుంటున్నామని సీఎం జగన్ అన్నారు. ఏలూరు జిల్లా కుక్కునూరు గొమ్ముగూడెంలో సీఎం జగన్ పర్యటించారు. వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరదలతో ఇళ్లు దెబ్బతింటే సహాయం అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఏ ఒక్కరూ సాయం అందకుంటే ఫిర్యాదు చేయొచ్చన్నారు. పోలవరం డ్యాంలో మూడు దశల్లో నీళ్లు నింపుతామని సీఎం జగన్ తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్ విషయంలో కేంద్రం నిధులకు తోడు రాష్ట్రం నిధులు అందిస్తామని..ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తామని సీఎం జగన్ అన్నారు.