CM Jagan: ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది
CM Jagan: ప్రతి రైతునూ మేము ఆదుకుంటాం
CM Jagan: ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారిందని, దీని ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురిశాయని, తుఫాను బాధిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడంపైనే ప్రత్యేక అధికారులు, కలెక్టర్లంతా దృష్టి పెట్టాలని ఏపీ సీఎం జగన్ సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాధితులపట్ల సానుభూతితో వ్యవహరించాలని, బాధితుల స్థానంలో మనమే ఉంటే ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో ఆ తరహా సహాయం అందించాలని ఆదేశించారు.. కష్టకాలంలో తమను కలెక్టర్లు, ప్రభుత్వం బాగా చూసుకున్నారనే మాట రావాలని జగన్ సూచించారాయన... రేషన్ పంపిణీలో ఎలాంటి లోపం ఉండకూడదని, పంట పొలాల్లో ఉన్న వరద నీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టిపెట్టాలన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్నదాతలు అధైర్యపడాల్సిన పనిలేదని, ప్రతి రైతునూ తాము ఆదుకుంటామన్నారు.