ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
CM Jagan: బ్యాంక్ లోగో, స్టాంప్‌ను ఆవిష్కరించిన జగన్
CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలో పర్యటించారు. నగరంలో ఏర్పాటు చేసిన ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బ్యాంక్ లోగో, స్టాంప్ ను సీఎం ఆవిష్కరించారు. 1963లో ప్రారంభమైన ఆప్కాబ్.. చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి పనిచేస్తోందని సీఎం తెలిపారు. బ్యాంకింగ్ సేవల్లో ఆప్కాబ్ రైతులకు ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు. నాలుగేళ్లలో ఆప్కాబ్ 36 కోట్ల 732 లక్షల టర్నోవర్ సాధించిందించగా, 4 ఏళ్లలో 251 కోట్ల లాభాల్లోకి ఆప్కాబ్ వెళ్లిందని తెలిపారు. నాలుగేళ్లలో రెండు సార్లు జాతీయ ఆప్కాబ్ జాతీయ అవార్డులను సాధించిందని పేర్కొన్నారు.