Rammohan Naidu: జగన్‌కు ప్రజల్లో ఉన్న కనీస గౌరవం కూడా పోయింది
Rammohan Naidu: ఏపీలో రాజ్యాంగం అమలవుతున్న దాఖలాలు లేవు
Rammohan Naidu: చంద్రబాబును అరెస్ట్ చేయించి పైశాచిక ఆనందం పొందుతున్న సీఎం జగన్ నైతికంగా ఓడిపోయారని అన్నారు టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు. చంద్రబాబు అరెస్ట్‌తో జగన్‌కు ప్రజల్లో ఉన్న కనీస గౌరవం కూడా పోయిందన్నారు. చంద్రబాబు అరెస్టులో నిబంధనలు పాటించకుండా పోలీసులు వ్యవహరించారన్నారు. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసే విధానం చరిత్రలో ఎక్కడా చూడలేదన్నారు. జగన్ క్రిమినల్ మైండ్‌తో ఉన్న వ్యక్తి కాబట్టే ప్రతిపక్ష నేతపై అరాచకాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఏపీలో భారత రాజ్యాంగం అమలవుతున్న దాఖలాలు లేవన్నారు. ఏపీలో జరుగుతున్న దారుణాలను పార్లమెంట్‌లో లేవెనుత్తుతాం అన్నారు ఎంపీ రామ్మోహన్‌నాయుడు.