Ap Online Class : ఆన్‌లైన్‌ తరగతులపై జగన్ సర్కార్ సీరియస్

Ap Online Class : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు.

Update: 2020-07-04 13:17 GMT

Ap Online Class : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. విద్య సంవత్సరం ప్రారంభం కాకుండానే కొన్ని స్కూల్స్ ఆన్లైన్ తరగతుల పేరుతో ఫీజులు కట్టాలంటు ఒత్తిడి తెస్తున్నారని, విద్యార్థులను, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి స్పందించారు.

విద్యా సంవత్సరాన్ని ఇప్పటి వరకు ఖరారు చేయలేదని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కానీ, కొన్ని ప్రైవేటు స్కూల్స్ ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

అలాగే కొన్ని స్కూల్స్ ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ప్రభుత్వం చెప్పే వరకు ఎలాంటి ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదనీ మంత్రి అన్నారు. నిబంధనలను అతిక్రమించి ప్రవర్తించే ప్రైవేటు విద్యా సంస్థలపై కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

జూలై 31 వరకు స్కూల్స్ తెరిచేది లేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గితేనే స్కూళ్లు తెరుచుకునే అవకాశాలున్నాయనీ కేంద్రం స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు చాలా వరకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ అంశాన్ని జగన్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి ఆదిములపు సురేష్ ప్రకటన చేశారు.


Tags:    

Similar News