Kotamreddy: జెడ్పీ చైర్మన్‌ను చేసిన ఆనంకు దూరం కావడం నీకు తగునా..?
Kotamreddy: ఆనం రాంనారాయణ రెడ్డిని క్షోభకు గురిచేయడం సబబేనా
Kotamreddy: తనది నమ్మక ద్రోహం అయితే కాకాణి గోవర్ధన్ రెడ్డిని జిల్లా పరిషత్ చైర్మన్ ను చేసింది ఆనం రాంనారాయణ రెడ్డి కాదా అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. ఆనం రాం నారాయణ రెడ్డిని దూరం పెట్టి ఆయనను క్షోభకు గురిచేయడం సరైందేనా అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని బావా కాకాణీ అంటూ సంబోధించారు. కాకాణికి ఆనం కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్న విషయం అందరికీ తెలుసన్నారాయన తాను చేసింది ద్రోహమయితే ఆనం కుటుంబానికి దూరం కావడం కూడా నీవు ద్రోహం చేసినట్లే కదా అని కోటం రెడ్డి అన్నారు.