పవన్‌కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా వినూత్న విషెస్
Pawan Kalyan: పొలంలో వరినారుతో శుభాకాంక్షలు తెలిపిన రైతులు
Pawan Kalyan: పవన్‌కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా కౌలు రైతులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. గుంటూరు జిల్లా అత్తోట గ్రామం కౌలు రైతులు వినూత్నంగా బర్త్‌డే విషెస్ తెలిపారు. పొలంలో వరినారుతో జనసేన లోగోను ఏర్పాటు చేశారు. పవన్ కోసం అత్తోట కౌలురైతులు అంటూ రాశారు. కౌలు రైతులకు పవన్‌కల్యాణ్ చేస్తోన్న సహాయం పట్ల ఆయనకు మద్దతు తెలిపేందుకు వరినారు వేసి శుభాకాంక్షలు తెలిపామన్నారు. ఇదే కాకుండా పొలంలో పండిన ధాన్యాన్ని పవన్‌కే పంపిస్తామన్నారు కౌలు రైతులు.