Indra Buses Turns as Sanjivini: 'ఇంద్ర'లో కరోనా వైద్య పరీక్షలు!
Indra Buses Turns as Sanjivini: కరోనా వైరస్ వ్యాప్తితో పాటు దాని నిర్ధారణకు వీలైనన్ని సేవలను వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
Indra Buses Turns as Sanjivini: కరోనా వైరస్ వ్యాప్తితో పాటు దాని నిర్ధారణకు వీలైనన్ని సేవలను వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు జిల్లా, డివిజన్ ఆస్పత్రుల్లో ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలను అందుబాటులో తీసుకుకొచ్చింది. దీంతో పాటు వీటి కోసం ప్రత్యేక అంబులెన్స్ లను ఏర్పాటు చేసి పరీక్షలు చేస్తోంది. ఈ కేసులు మరింత ఎక్కువవుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో సేవలందించని ఆర్టీసీ సర్వీసులను వినియోగించుకుంటోంది. అవసరాన్ని బట్టి జిల్లాకు రెండు, మూడు బస్సలు పంపేలా నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఇప్పటికే 21 ఇంద్ర బస్సులను సంజీవిని వాహనాలను మార్చిన ఏపీ ఆర్టీసీ వీటి సంఖ్యను మరింత పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోదించడానికి ఆర్టిసి కూడా పాత్ర పోషిస్తోంది. ఎపిలో ఇంద్ర ఆర్టిసి బస్ లను సంజీవని బస్ లుగా మార్చామని ఆర్టిసి ఎమ్.డి. మాదిరెడ్డి ప్రతాప్ చెప్పారు. వీటి ద్వారా కరోనా నిర్దారణ పరీక్షలు జరుగుతాయని ఆయన చెప్పారు. ఇప్పటివరకు 21 సంజీవని వాహనాలు ఏర్పాటు చేశామని, వాటిని అన్ని జిల్లాలకు పంపిస్తామని తెలిపారు. రానున్న 10 రోజుల్లో మరో 30 వాహనాలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు..
యి. సంచార రైతు బజారు కోసం ఆర్టీసీ బస్సులను తయారు చేశాం. కరోనా సమయంలోనూ ఆర్టీసీ సిబ్బంది సేవలందిస్తున్నారు. ప్రతి జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నాం అని ఆయన వివరించారు. లాక్‌డౌన్ కారణంగా ఆర్టీసీకి రూ.4,200 కోట్ల నష్టం వచ్చింది, అయినా ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇస్తున్నామని ప్రతాప్ తెలిపారు.