కష్టాల్లో ఉన్న మహిళకు ఆర్ధిక సహాయం చేసిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు!

తానూ కష్టాల్లో ఉన్నానని, రోజుకు రూ.700 వరకు వ్యాపారం సాగుతోందని, వచ్చే డబ్బులతో కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉందని నాగమణి చెప్పగా, ఉప రాష్ట్రపతి వెంకయ్య ఆమె బ్యాంకు అకౌంట్ నెంబర్ ను తెప్పించుకొని వెంటనే ఆమెకు రూ. 15 వేల ఆర్ధిక సహాయం చేసారు.

Update: 2020-12-12 07:43 GMT

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన ఔదార్యాన్ని చాటుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విశాఖ వచ్చిన అతను బీచ్ రోడ్డులో టీ దుకాణం నడుపుతున్న నాగమణి అనే ఓ మహిళ వద్ద టీ తాగి కుశలం అడిగారు. వ్యాపారం ఎలా సాగుతోందని, రోజుకు ఎంత సంపాదిస్తుంటారు? వచ్చే మొత్తం జీవనోపాధికి సరిపోతోందా?అంటూ ఆ మహిళను ప్రశ్నలు అడిగారు వెంకయ్య. ఈ సందర్భంగా ఆ మహిళ తానూ కష్టాల్లో ఉన్నానని, రోజుకు రూ.700 వరకు వ్యాపారం సాగుతోందని, వచ్చే డబ్బులతో కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉందని నాగమణి చెప్పగా, ఉప రాష్ట్రపతి వెంకయ్య ఆమె బ్యాంకు అకౌంట్ నెంబర్ ను తెప్పించుకొని వెంటనే ఆమెకు రూ. 15 వేల ఆర్ధిక సహాయం చేసారు. ఓ ఉప రాష్ట్రపతి తన వద్ద టీ తాగడమే కాకుండా, తనకు ఆర్ధిక సహాయం చేసినందుకు ఉబ్బితబ్బిబవుతోంది ఆ మహిళ.

Tags:    

Similar News