Srisailam : శ్రీశైల మల్లన్న క్షేత్రానికి పెరుగుతున్నభక్తుల రద్దీ..

Srisailam : శ్రీశైల క్షేత్రాన్ని దర్శంచుకున్నదేవాదాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ

Update: 2023-10-14 06:15 GMT

 Srisailam : శ్రీశైల మల్లన్న క్షేత్రానికి పెరుగుతున్నభక్తుల రద్దీ..

Srisailam : శ్రీశైలం క్షేత్రానికి భక్తుల రద్దీ రోజురోజుకుగు పెరుగుతుందని దానికి తగ్గట్టు సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర దేవాదాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల్ వలవెన్ అధికారులను అదేశించారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను కరికాల్ వలవెన్ దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానం నిర్వహిస్తున్న విభూతి తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. తరువాత భ్రమరాంబ అతిథి గృహంలో శ్రీశైలం మాస్టర్ ప్లాన్ కు సంబంధిత అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ భక్తులకు కల్పించాల్సి సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అలానే పర్యావరణ పరిరక్షణలో భాగంగా,క్షేత్ర సుందరీకరణకు పచ్చదనాన్ని మరింతగా పెంపొందించాలని కోరారు.

Tags:    

Similar News