Tirumala: శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న రద్దీ
Tirumala: సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న టీటీడీ
Tirumala: కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తజనుల సందడి నెలకొంది. కరోనా లాక్‌డౌన్ అనంతరం పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్న టీటీడీ.. పవిత్రమైన పెరటాసి మాసం ప్రారంభం కావడంతో రోజుకు 8వేల మంది భక్తులకు ఉచిత దర్శనం టికెట్లను కేటాయిస్తొంది. దీంతో తమ ఇష్టదైవమైన శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించేందుకు పలు ప్రాంతాల నుండి భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు.
కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సంవత్సరం పొడవునా భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుని మ్రొక్కులు తీర్చుకుంటుంటారు. అయితే 'తిరుమల శనివారాలు' అని పిలిచే పెరటాసి మాసాన్ని ముఖ్యమైన మాసంగా భక్తులు భావిస్తారు. ఈ నెలలో వెంకటేశ్వరస్వామిని ఆరాధించినా, పూజించినా, మొక్కుబడులు చెల్లించిన అత్యంత పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
సాధారణంగానే నాటి నుండి కూడా శ్రీవారిని దర్శించుకున్న భక్తులు దాదాపు 50 శాతం మంది ఎక్కువ తమిళ భక్తులే ఉంటారు. ఈ కారణంగా ఈ పెరటాసి మాసంలో వచ్చే ఐదు శనివారాలు కూడా చాలా నిష్ఠగా, నియమ నిబంధనలతో గోవింద మాల ధారణ చేసుకొని వారివారి సొంత గ్రామాల నుండి కాలినడకన తిరుమలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు.