Nara Lokesh: ఇవాళ కుప్పంలో చారిత్రక కార్యక్రమం చేపట్టనున్న లోకేశ్
Nara Lokesh: కుటుంబ సభ్యులతో కలిసి గ్రామదేవతకు పూజలు
Nara Lokesh: టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేశ్ ఇవాళ చారిత్రక అడుగులు వేయనున్నారు. నాలుగు వందల రోజులు 4 వేల కిలోమీటర్ల మేర పాదయాత్రకు సిద్ధమయ్యారు. కుటుంబ సభ్యులు, పార్టీశ్రేణులతో కలిసి కుప్పం గ్రామదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఆయన యువగళంపేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమంలో లోకేశ్‌కు తోడుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులు, బాలకృష్ణ దంపతులు సంఘీభావంగా కలిసి నడవబోతున్నారు.
పాదయాత్ర విజయవంతం కావాలని సర్వమత ప్రార్థనలు చేసిన లోకేశ్ ఇవాళ పార్టీ శ్రేణులతో కలిసి అమ్మవారిని ఆరాధించిన తర్వాత పాదయాత్రను చేపట్టనున్నారు. ప్రతిరోజూ కనీసం పది కిలోమీటర్లమేర పాదయాత్ర సాగే విధంగా షెడ్యూలుతోపాటు రూట్ మ్యాప్‌ను సిద్ధంచేశారు. దారిపొడవునా ప్రజలతో మమేకమై వారి బాగోగులను తెలుసుకోనున్నారు.