Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షసూచన...హైదరాబాద్లో కుండపోత
Telugu States Weather Report: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షం కురుస్తోంది. బుధవారం ఢిల్లీలో కుండపోత వర్షం కురిసింది. కేరళ, ఢిల్లీకి భారీ వర్షసూచన ఉన్నట్లు హెచ్చరించింది వాతావరణ శాఖ. మరి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో చూద్దాం.
Telugu States Rain Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, కేరళలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కేరళ, ఢిల్లీ రాష్ట్రాలకు భారీ వర్షసూచన ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. అరేబియా సముద్రంలో ఓ తుఫాన్ సుడిగుండంగా మారింది. ఈ కారణాల వల్ల ఆగస్టు 1వ తేదీ నుంచి 5 రోజుల పాటు ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఆగస్టు 1వ తేదీ మధ్యాహ్నం 3 తర్వాత పశ్చిమ తెలంగాణ, కోస్తాలో జల్లులు పడుతాయి. సాయంత్రం 4 తర్వాత వర్షం పెరుగుతుంది. సాయంత్రం 5గంటల తర్వాత ఉత్తర, పశ్చిమ తెలంగాణ, హైదరాబాద్, కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, అక్కడక్కడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాత్రి 8 తర్వాత ఉత్తర తెలంగాణలో వర్షం పడుతుందని తెలిపింది. అర్థరాత్రి వరకు వర్షం పడుతుందని అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ తెలిపింది. అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అరేబియాలో పరిస్థితులు బాగలేనందున కేరళ గజగజా వణికిపోతుంది. అటు నుంచి వచ్చే గాలులు వేగం స్థిరంగా ఉండదని ఐఎండీ పేర్కొంది.
ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదు నీరు వస్తుండటంతో శ్రీశైలం డ్యామ్ పది గేట్లను ఎత్తివేశారు. ఈ ఇన్ ఫ్లూ ఓ ఐదు రోజులపాటు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో డ్యామ్ చూసేందుకు వెళ్లే పర్యాటకులు..డ్యామ్ వద్ద అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. నల్లమలలో ప్రయాణించే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.