Jawad Cyclone: ఉత్తరాంధ్రకు జొవాద్ తుఫాన్ ముప్పు తప్పిందన్న ఐఎండీ
Jawad Cyclone: ఉత్తరాంధ్రకు జొవాద్ తుఫాన్ ముప్పు తప్పినట్లు భారత వాతావరణశాఖ తెలిపింది.
Jawad Cyclone: ఉత్తరాంధ్రకు జొవాద్ తుఫాన్ ముప్పు తప్పినట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం విశాఖకు 210 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతూ బలహీనపడుతున్నట్లు ఐఎండీ స్పష్టం చేసింది. ఇక దీని ప్రభావంతో ఒడిశా, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని శ్రీకాకుళంలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక జవాద్ తుఫాను రేపు మధ్యాహ్నం ఒడిశాలోని పూరీలో తీరం దాటుతుందని భావిస్తున్నారు.