Rain Alert: ఏపీలో అతి భారీ వర్షాలు..అప్రమత్తమైన ప్రభుత్వం, పాఠశాలలకు సెలవు..టోల్ ఫ్రీ నంబర్లు ఇవే
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడిప్పుడే వరదల నుంచి కోలుకుంటున్న ఏపీ ప్రజలకు మరోసారి భారీ వర్షం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు.బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రూపంలో భారీ వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పుడిప్పుడే వరదల నుంచి కోలుకుంటున్న ఏపీ ప్రజలకు మరోసారి భారీ వర్షం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు.బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం రూపంలో భారీ వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఆవర్తన పీడనం క్రమంగా బలపడి ఈనెల 14వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దాని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ విభాగం సూచించింది.
ఏపీకి పక్కనే ఈ అల్పపీడనం ఏర్పడునుందని..15వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అధికారులు చెబుతున్నారు. అల్పపీడనం కారణంగా ఈదురుగాలులు గంటకు 35-55 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉంది. 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
రానున్న 4రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ మేరకు ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు విపత్తు నిర్వహణ శాఖలను ఆదేశించింది. కంట్రోల్ రూమ్స్, హెల్ప్ లైన్్ సెంటర్ లను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
విజయవాడ, ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, సత్యసాయి జిల్లాలు ముంపునకు గురికాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ముంపు ప్రాంతాల్లోని రైతులు, మత్స్యకారులకు హెచ్చరికలు ఇవ్వాలని తెలిపింది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు మంజూరు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే ఆయా జిల్లాల కలెక్టర్ల ఆదేశాల మేరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చే ఛాన్స్ ఉంది.