కృష్ణాజిల్లాలోని గంపలగూడెం మండలం వినగడప సమీపంలో భారీగా తరలిస్తున్న అక్రమ మద్యం పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రం భీమవరం నుంచి విజయవాడకు 1,214 మద్యం బాటిళ్లను టాటా ఎఎస్ వాహనంలో తరలిస్తుండగా.. వినగడప అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద తనిఖీలో పోలీసుల స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ బెల్ట్ షాపు నిర్వాహకుడు పైన కేసు నమోదు చేశారు. ఈ కేసు 8 వ్యక్తులను అరెస్ట్ చేసి ఒక టాటా ఏస్ బైక్ లను సీజ్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామ అని డీఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపారు. అరెస్ట్ చేసిన వారిని తిరువూరు కోర్టులో హాజరు పరచనున్నట్టు డీఎస్పీ బి.శ్రీనివాసులు వెల్లడించారు.
తెలంగాణ నుంచి ఆంధ్రకు వచ్చే వాహనాదారులు స్పందన యాప్ లో నమోదు చేసుకోవాలని, ఆంధ్ర పాస్ తీసుకోవాలి పాస్ లేకుండా వస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఆనుమతించమని స్పష్టం చేశారు. చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది కి పలు సూచనలు సలహాలు రికార్డులనుపరిశీలించారు వాహనాలదారులతో మర్యాద మెలగాలి భౌతిక దూరం శానిరైజర్ ను ఉపయెగించాలి. అక్రమ మద్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. డ్యూటీ లో విధులు సక్రమంగా నిర్వహించిన సిబ్బంది కి రివార్డులు కు సిఫారసు చేయటం జరుగుతుంది అని డీఎస్పీ తెలిపారు.