Amaravati: అమరావతిలో నిర్మాణాలపై ఐఐటీ నిపుణుల ప్రాథమిక నివేదిక
Amaravati: అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై ఐఐటీ నిపుణులు ప్రాథమిక నివేదిక సమర్పించారు.
Amaravati: అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలపై ఐఐటీ నిపుణులు ప్రాథమిక నివేదిక సమర్పించారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే ఐకానిక్ భవనాల కోసం ఫౌండేషన్ల నిర్మాణం పూర్తయింది. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సెక్రటేరియట్ ప్రధాణ టవర్ల పునాదులు నీటిలో నానిపోయాయి. ఈ నిర్మాణాలను ఐఐటీ టీమ్ పరిశీలించింది. హైకోర్టు సచివాలయం మిగిలిన భవనాలకు ఎలాంటి ఢోకాల లేదని ఐఐటీ నిపుణులు ప్రైమరీ రిపోర్టులో తెలిపారు.
బయట కనిపిస్తున్న తుప్పును తొలగిస్తే ఎలాంటి ఇబ్బందులుండవని తెలిపింది. ప్రతి భవనానికి కూడా తుప్పును క్లీన్ చేసి కెమికల్ ట్రీట్‌మెంట్ ఇచ్చి తిరిగి నిర్మాణాలు చేపట్టవచ్చని స్పష్టం చేసింది ఐఐటీ టీమ్. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసుల అధికారులు, గ్రూప్-1 అధికారులు, ఎన్జీవోలు, నాలుగో తరగతి ఉద్యోగుల కోసం నిర్మించిన.. వివిధ దశల్లో ఉన్న భవనాల పటిష్ఠతను హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. వాటికి కూడా ఢోకా లేదని, నిర్మాణాలు కొనసాగించవచ్చని ఆ బృందం నిగ్గుతేల్చినట్టు సమాచారం.